Breaking News
Home / States / అనుమానంతో భార్యను చంపిన కానిస్టేబుల్…

అనుమానంతో భార్యను చంపిన కానిస్టేబుల్…

అంబర్‌పేట: ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. కర్నూలు టౌన్‌కు చెందిన అబ్దుల్‌ రషీద్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌) విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ భార్య నౌషిదా బేగం(23) కుమార్తెతో కలిసి ఏడాదిగా అంబర్‌పేట అజాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో నౌషిదా అతడిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. గత కొంతకాలంగా నౌషిదాపై అనుమానం పెంచుకున్న రషీద్‌ తరచూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న మళ్లీ వారి మధ్య గొడవ జరగడంతో ఇంటి యాజమాని సలీం వారికి సర్ధిచెప్పాడు. అతను ఇంట్లో నుంచి బయటికి వెళ్లగానే రషీద్‌ ఆమెపై రాడ్డు దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఇంటి యాజమాని సలీం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నౌషిదా బేగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా అసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *