Breaking News
Home / hyderabad / నిందితుల శవాలను చూడాలని ఉంది : దిశ తల్లి

నిందితుల శవాలను చూడాలని ఉంది : దిశ తల్లి

హైదరాబాద్: శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లి స్పందించారు. దిశకు న్యాయం జరిగిందన్నారు. 8 రోజుల్లోనే దిశకు న్యాయం చేశారని చెప్పారు. ‘‘ఏడేళ్లైనా నిర్భయకు న్యాయం జరగలేదు. మీడియాకు, పోలీసులకు ధన్యవాదాలు. మా అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరింది. నిందితుల ఎన్‌కౌంటర్‌తో మాకు మనశ్శాంతి కలిగింది. ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని ఊహించలేదు. నిందితుల శవాలను చూడాలని ఉంది. మా అమ్మాయి లేదన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నా. అందరిగురించి నా కూతురు మంచిగా ఆలోచించేది’’ అని దిశ తల్లి వ్యాఖ్యానించారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *