Breaking News
Home / National / గ్రామంలో మొసళ్ళు…భయాందోళనలో ప్రజలు…

గ్రామంలో మొసళ్ళు…భయాందోళనలో ప్రజలు…

బీహార్‌: బీహార్‌లోని రియాషి ప్రాంతంలో మొసళ్లు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పిప్రాసిలోని పార్సౌని గ్రామంలో మొసలి ఓ ఇంట్లోకి చొరబడింది. గమనించిన కుటుంబీకులు మొసలిని చూసి భయంతో బయటకు పరుగులు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. అందరూ కలిసి ఆ ముసలిని చాకచక్యంగా బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పార్సౌని గ్రామంలోని చెరువులో డజన్ల కొద్దీ మొసళ్లు ఉన్నాయని, వాటిని అక్కడి నుంచి తరలించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. వాటివల్ల తమకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వచ్చే వరకు బంధించిన మొసలితో పిల్లలు కాసేపు సరదాగా ఆడుకున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *