Breaking News
Home / States / మనోవేదనకు గురై ఆర్టీసీ డ్రైవర్ భార్య మృతి…

మనోవేదనకు గురై ఆర్టీసీ డ్రైవర్ భార్య మృతి…

జనగామ జిల్లా: జఫర్‌గడ్‌ మండలంలోని కూనూరు గ్రామానికి చెందిన రంగు సందీప్‌ కొంతకాలంగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగడంతో ప్రభుత్వం వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త కొలువు పోయిందని తీవ్ర మనోవేదనకు గురైన సందీప్ భార్య రంగు శ్రీలత(25) గురువారం మృతి చెందింది.

అప్పటి నుంచి పిల్లలను ఎలా పోషించుకోవాలని ఆమె కలత చెందింది. పది రోజులుగా తీవ్ర మనోవేదనతో ముబావంగా ఉన్న శ్రీలతను చుట్టుపక్కల వారు గమనించి అడుగగా తన భర్త కొలువు పోయి వీధిన పడ్డామని చెప్పేదని తెలిపారు. దీంతో అనారోగ్యానికి గురైన శ్రీలతను గురువారం హన్మకొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *