Breaking News
Home / States / Andhra Pradesh / తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని….

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని….

కర్నూలు: రూ.10వేల కోసం కర్నూలు నగరానికి చెందిన విజయలక్ష్మి (35) అనే మహిళను ఆటోడ్రైవర్‌ దారుణంగా హత్య చేశాడు. తన దగ్గర తీసుకున్న రూ.10వేలు అప్పు తిరిగి ఇవ్వాలని బాబు ఆమెను అడిగాడు. తాను ఇప్పుడే ఇవ్వలేనని ఆమె చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  కోపంతో ఉన్న బాబు ఆమెను  విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. కుప్పకూలి పడిపోయిన విజయలక్ష్మిని ఆమె భర్త అంజి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్‌ బాబుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితుడిపై గతంలో హత్యాయత్నం, హత్య, దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *