Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఛార్జీల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి…

ఛార్జీల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి…

అమరావతి: ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఒకవైపు ఆర్థికమాంద్యం, మరోవైపు నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు సతమతమవుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మండిపడ్డారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రజా రవాణాగా ఉన్న ఆర్టీసీ ఛార్జీలు పల్లె వెలుగుకు కిలోమీటరుకు 10 పైసలు, ఇతర బస్సులకు కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీస్తుందని మండిపడ్డారు. పరోక్షంగా సరకు రవాణా మీద కూడా భారం పెరిగి వాటి ధరలు మరింత పెరగనున్నాయన్నారు. ఆర్టీసీ నష్టాలను పూడ్చేందుకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిందిపోయి ప్రజలపై భారం వేయడం సరికాదని హితవుపలికారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *