Breaking News
Home / social media / ఆ తండ్రిని చూస్తే గర్వంగా ఉంది

ఆ తండ్రిని చూస్తే గర్వంగా ఉంది

సోషల్ మీడియా లో వైరల్ గా మారిన తండ్రి కథ.

ఆ ముగ్గరు పిల్లలు అదృష్టవంతులు.

ప్రతి తండ్రి మియాఖాన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.

నెటిజన్లు మియాఖాన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మియాఖాన్‌.. ఆఫ్గనిస్తాన్‌లోని శరణ్‌ ప్రాంత నివాసి. ఆయనకు ఓ కొడుకు, ముగ్గరు కూతుళ్లు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అయినప్పటికీ కూతుళ్లను చదివించాలనుకున్నాడు. కానీ సమీప ప్రాంంతంలో పాఠశాలలు లేవు. తమ నివాసానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాఠశాలలో ముగ్గురు కూతుళ్లను జాయిన్‌ చేయించాడు. అయితే అక్కడికి వెళ్లేందుకు బస్సు సదుపాయం కూడా లేకపోవడంతో ప్రతి రోజులు ఆయన తన మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్తున్నాడు. కూతుళ్లను పాఠశాలలో వదిలి సాయంత్రం వరకు అక్కడే ఉంటాడు. పాఠశాల ముగియగానే కూతుళ్లను తీసుకొని ఇంటికి వస్తాడు. ఇదే ఆయన దినచర్య. తాను ఎలాగో చదువుకోలేదని, తన కూతుళ్లను పెద్ద చదవులు చదివిస్తానని మియాఖాన్‌ చెబుతున్నాడు. ‘ నేను చదువుకోలేదు. కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. నా కూతుళ్లకు మంచి విద్యను అందించడం కోసం నేను పని కూడా మానేశా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నా కూతుళ్లను చదివిస్తా. వాళ్లను డాక్టర్లుగా చూడాలని నా కోరిక. మా ప్రాంతంలో మహిళా డాకర్లు లేరు. నా కూతుళ్లు డాక్టర్లై మా ఏరియా ప్రజలకు సేవచేస్తే చూడాలని ఉంది. అదే నా లక్ష్యం. నా కూతుళ్లను కొడుకుల్లా పెంచి డాక్టర్లను చేయిస్తా’ అని మియాఖాన్‌ పేర్కొన్నారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *