పశ్చిమ గోదావరి : గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో గ్రామ స్వరాజ్యానికి విఘాతం కల్పిస్తే.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల పేరుతో గ్రామ స్వరాజ్యానికి ఆటంకం కల్పిస్తోందని మాజీ మంత్రి బిజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతిని పురస్కరించుకొని.. ఈ నెల 2 నుండి బీజేపీ తలపెట్టిన గాంధీజీ మహా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా.. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ యాత్ర కన్వీనర్ రావూరి సుధా మీడియాతో మాట్లాడుతూ… 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచారని విమర్శించారు. రోజుకొక నియోజకవర్గం చొప్పున మొత్తం పదిహేను రోజులు జిల్లాలో యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
