Breaking News
Home / Crime / ప్రియురాలిని హత్య చేసి.. ఆపై ప్రియుడు ఆత్మహత్య…

ప్రియురాలిని హత్య చేసి.. ఆపై ప్రియుడు ఆత్మహత్య…

ముంబై: ప్రియురాలిని చంపిన అనంతరం ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని మలాడ్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగేష్‌ రాణే(24) అనే యువకుడు 17 ఏళ్ల అమ్మాయిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే తన ప్రియురాలికి ఇంటికి మంగేష్‌ వెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సహనం కోల్పోయిన మంగేష్‌.. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా పదో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. దీంతో మంగేష్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ప్రియురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *