Breaking News
Home / Crime / దిశ కేసు వెనుక ప్రముఖుల హస్తం…..?

దిశ కేసు వెనుక ప్రముఖుల హస్తం…..?

ప్రముఖుల హస్తం ఉందేమో?
పోలీసులు నిజాయితీగా ఉండాలి: నటుడు ఉపేంద్ర
బెంగళూరు: ప్రముఖులు అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లో ఎన్‌కౌంటర్లు ఎందుకు జరగడం లేదని ప్రముఖ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు ఉపేంద్ర ప్రశ్నించారు. దిశపై హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆదివారం ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘ఆమెను హత్యాచారం చేసి కాల్చివేసింది ఆ నలుగురేనో? కాదో? ఘటన వెనుక ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందేమో? ఇదే తరహాలో ఎన్‌కౌంటర్లు ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఎందుకు జరగవు? ఒకానొక కాలంలో రౌడీయిజాన్ని తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు సాగేవి.

నిజాయితీ పోలీసు అధికారులు మనసు పెడితే ఎన్‌కౌంటర్ల ద్వారా అత్యాచారాలను నియంత్రించవచ్చు. దీన్ని ప్రముఖులు, శ్రీమంతులు దుర్వినియోగం చేయకుండా అధికారులు హెచ్చరికగా ఉండాలి’ అని పేర్కొన్నారు. అయితే, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన ఉపేంద్ర బాధ్యతాయుతంగా స్పందించాలని పలువురు హితవు పలికారు. కాగా, ఎన్‌కౌంటర్‌పై పోలీసు చర్యలను వ్యతిరేకించడం సరికాదని మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్‌ అన్నారు. ఎన్‌కౌంటర్‌లోని ఘటనలు చట్టప్రకారమే అయితే తప్పులేదన్నారు. రాజుల కాలానికీ, నేటి ప్రజాస్వామ్యానికి వ్యత్యాసం ఉందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *