Breaking News
Home / States / Andhra Pradesh / పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు

పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు

చౌటుప్పల్‌ గ్రామీణం: సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద టోల్‌ ఛార్జీలు చెల్లించేందుకు వాహన చోదకులు గంటకు పైగా వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పంతంగి టోల్‌గేట్‌ నుంచి లింగోజీ గూడెం సమీపంలోని దివిస్‌ పరిశ్రమ వరకు 3కిలో మీటర్ల మేర జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రద్దీ నేపథ్యంలో యాదాద్రి జిల్లా డీసీపీ రామచందర్‌రెడ్డి, చౌటుప్పల్‌ ట్రాఫిక్‌, సివిల్‌ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

Check Also

ఎన్నికల ఫలితాలపై నారా భువనేశ్వరి స్పందన

Share this on WhatsAppహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరేసి.. ఊహించని మెజార్టీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *