Breaking News
Home / Crime / గిఫ్ట్‌కు ఆశ‌ప‌డి రూ.85 వేలు పొగొట్టుకున్న హీరోయిన్‌

గిఫ్ట్‌కు ఆశ‌ప‌డి రూ.85 వేలు పొగొట్టుకున్న హీరోయిన్‌

సైబ‌ర్ నేరాల నుండి జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ పోలీసులు ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్త‌లు చెబుతున్నా కూడా ప్ర‌జ‌లు ఏదో ర‌కంగా మోస‌పోతూనే ఉన్నారు. ఈ లిస్టులో సెల‌బ్రిటీలు కూడా ఉండ‌టం అంద‌రికీ షాకింగ్ విష‌య‌మే. అస‌లు విష‌యాని వెళితే.. హీరోయిన్ సోనాక్షి వ‌ర్మ రీసెంట్‌గా ఇలాంటి సైబ‌ర్‌ మోసగాళ్ల చేతిలో మోస‌పోయారు. ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండే సోనాక్షి వ‌ర్మ‌కు కొన్ని నెల‌ల క్రితం మెర్రిన్ కిర్రాక్ అనే నైజీరియ‌న్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. ఆ రిక్వెస్ట్‌ను సోనాక్షి ఓకే చేసింది, ఆ నైజీరియ‌న్‌తో అప్ప‌డ‌ప్పుడు చాటింగ్ కూడా చేస్తుండేవారు. రీసెంట్‌గా మెర్రిన్ త‌మ స్నేహానికి గుర్తుగా ఓ బ‌హుమ‌తిని పంపుతున్నానంటూ ఫోన్ చేశాడు. అలా ఫోన్ వ‌చ్చిన కొన్నిరోజుల త‌ర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుండి ఫోన్ చేస్తున్నామంటూ ఓ వ్య‌క్తి ఫోన్ చేశారు. నైజీరియా గిఫ్ట్ వ‌చ్చింద‌ని, రూ. 85 వేలు ఇస్తేనే ఆ గిఫ్ట్ పంపుతామ‌ని ఆ వ్య‌క్తి సోనాక్షికి తెలియ‌జేశారు. నిజంగా త‌న‌కు ఫోన్ చేసింది ఎయిర్‌పోర్ట్ అధికారేన‌ని న‌మ్మిన సోనాకి వ‌ర్మ‌, ఆయ‌న చెప్పిన అకౌంట్‌కు రూ.85వేలు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. వారం రోజులైనా బహుమ‌తి రాక‌పోవ‌డంతో, త‌న‌కు వ‌చ్చిన నంబ‌ర్‌కు తిరిగి కాల్ చేసింది సోనాక్షి. ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండ‌టంతో తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించి, హైద‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Check Also

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డ ఎమ్మార్వో….

Share this on WhatsAppహైదరాబాద్: బాచుపల్లి మండల రెవెన్యూ ఆఫీసర్(ఎమ్మార్వో) యాదగిరి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *