Breaking News
Home / States / ఆ ఇరువురికి హైకోర్టు పలు సూచనలు…

ఆ ఇరువురికి హైకోర్టు పలు సూచనలు…

హైదరాబాద్‌: సమ్మెకు దిగిన కార్మికులకు గతనెల వేతనాలు చెల్లిస్తామని హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అయితే, సమ్మె నేపథ్యంలో వేతనాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని తెలపడంతో సోమవారం లోపు వారికి వేతనాలు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.

అలాగే, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. కార్మికులతో సర్కారు చర్చలు జరపాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గి, సమ్మె విరమించాలని సూచించింది. కాగా, చర్చల కోసం ప్రభుత్వం నుంచి పిలుపురాకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *