అమరావతి : హైకోర్టును అమరావతిలోనే ఉంచాలని న్యాయవాదుల జేఏసీ తెలిపింది. ఈరోజు 10 జిల్లాల బార్ అసోసియేషన్ న్యాయవాదుల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యాయవాదుల జేఏసీ నేతలు మాట్లాడుతూ… హైకోర్టును తరలించే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే విరమించుకోవాలన్నారు. హైకోర్టు తరలింపును 10 జిల్లాల న్యాయవాదుల జేఏసీ వ్యతిరేకిస్తుందన్నారు. హైకోర్టును అమరావతిలోనే ఉంచాలని రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతికి లేఖలు రాస్తామన్నారు. ఛలో ఢిల్లీ, ఛలో హైకోర్టు కార్యక్రమాలను నిర్వహిస్తామని న్యాయవాదుల జేఏసీ తెలిపింది.
