Breaking News
Home / National / శివసేనకు హోం, పట్టణాభివృద్ధి శాఖలు

శివసేనకు హోం, పట్టణాభివృద్ధి శాఖలు

ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని ‘మహా వికాస్ అఘాడి’ సర్కార్ గత నెల 28న ప్రమాణస్వీకారం చేసినప్పటికీ శాఖల కేటాయింపులు జరగలేదు. ఎట్టకేలకు శాఖల కేటాయింపుపై మూడు పార్టీల కూటమి తాజాగా ఒక అవగాహనకు వచ్చింది. ముఖ్యమంత్రి సహా, ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రులకు శాఖలేవంటూ బీజేపీ ఇటీవల విమర్శలు సంధించడం, తమ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందని, 80 రోజులు కాదని, తొందరేమీ లేదని శివసేన దీటుగా జవాబివ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ను ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ మంగళవారం సాయంత్రం కలుసుకుని అధికార పంపంకాలపై తుది కసరత్తు చేశారు.

శివసేన వర్గాల తాజా సమాచారం ప్రకారం, కీలకమైన హోం శాఖ, పట్టణాభివృద్ధి శాఖలను తమ వద్దే శివసేన ఉంచుకోనుంది. ఎన్‌సీపీకి ఆర్థిక శాఖ, హౌసింగ్ శాఖ అప్పగిస్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన కాంగ్రెస్ నేత నానా పటోలేకు రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశాలున్నాయి. ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) పోర్ట్‌ఫోలియో ఎవరికి దక్కనుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *