Breaking News
Home / National / యూకేలో జరగనున్న ది హండ్రెడ్‌ టోర్నీ…

యూకేలో జరగనున్న ది హండ్రెడ్‌ టోర్నీ…

లండన్‌: యూకేలో జరిగే హండ్రెడ్‌ బాల్‌ టోర్నమెంట్‌కు ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, విండీస్‌ దిగ్గజం, టీ-20 స్పెషలిస్టు క్రిస్‌గేల్‌, ఆస్ట్రేలియా సంచలనం స్టీవ్‌ స్మిత్‌ అందుబాటులో ఉండనున్నారు. యూకేలో జరిగే ఈ హండ్రెడ్‌ బాల్‌ టోర్నీ వచ్చే ఏడాది జూలై 17 నుంచి ఆగస్టు 16 వరకు జరుగనుంది. ఎనిమిది జట్లు ఈ టోర్నీలో తలపడుతాయి. పేరొందిన అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం ఈ టోర్నీలో ఆడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ సంచలన ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌, ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ ఆఫ్రిది ఈ జాబితాలో ఉన్నారు. ది హండ్రెడ్‌ టోర్నీ ఏంటంటారా..? చాలా సింపుల్‌ ఒక్కో జట్టు 100 బంతులాడాల్సి ఉంటుంది. ఏ జట్టైతే ఎక్కువ పరుగులు సాధిస్తుందో ఆ జట్టే విజేత. ఈ టోర్నీలో మొత్తం 32 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. టాప్‌లో ఉన్న మూడు జట్లు ఆఖరి రోజు తలపడతాయి. టాప్‌లో ఉన్న జట్టు నేరుగా ఫైనల్లో అడుగు పెడుతుంది. మిగితా రెండు జట్లు ఫైనల్‌ బెర్త్‌ కోసం తలపడతాయి.

జట్ల వివరాలు: లండన్‌ నుంచి రెండు జట్లు, బర్మింగ్‌హామ్‌, మాంచెస్టర్‌, లీడ్స్‌, నాటింగ్‌హామ్‌, కార్డిఫ్‌ మరియు సౌతాంప్టన్‌.

టోర్నీకి అందుబాటులో ఉన్న అంతర్జాతీయ ఆటగాళ్లు: షకిబ్‌ అల్‌ హసన్‌, మోయిన్‌ అలీ, బాబర్‌ ఆజమ్‌, టామ్‌ కర్రన్‌, డీ కాక్‌, ఫాఫ్‌ డూ ప్లెసిస్‌, ఆరోన్‌ ఫించ్‌, లసిత్‌ మలింగ, కీరన్‌ పొలార్డ్‌, కగిసో రబాడా, జేసన్‌ రాయ్‌, మిచెల్‌ స్టార్క్‌, కేన్‌ విలియమ్సన్‌.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *