Breaking News
Home / National / పోలీసులకు చుక్కలు చూపించిన మహిళలు

పోలీసులకు చుక్కలు చూపించిన మహిళలు

డెహరాడూన్: “భర్త మృతదేహాన్ని నాకే ఇవ్వాలి” అంటూ ఐదుగురు మహిళలు పట్టుబట్టడంతో ఏం చేయాలో తేలిక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో హరిద్వార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం..సోమవారం ఉదయం ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. భర్త అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన భార్య వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించింది. కానీ..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ లోపు మరో నలుగురు మహిళలు ఆసుపత్రికి చేరుకున్నారు. “మృత దేహాన్ని నాకే ఇవ్వాలి” అంటూ ఐదుగురూ పట్టుబట్టడంతో పోలీసులు ఏం చేయలేక చేతులెత్తేశారు. “మీలో మీరే చర్చించుకుని ఓ నిర్ణయానికి రండి” అంటు తేల్చిచెప్పారు. ఆ ఐదుగురు వనితల ఆగ్రహం చల్లారిన తరువాత వారికి మృతదేహాన్ని అప్పగించారు. వారితో పాటు ఓ కానిస్టేబుల్‌ను కుడా పంపించారు. అతడి సమక్షంలో మృతుడి అంత్యక్రియలు జరిపించి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *