Breaking News
Home / Education / ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం….

ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం….

హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలు, ఇంటర్మీడియట్‌ కోర్సును ఆఫర్‌ చేస్తున్నకాంపోజిట్‌ డిగ్రీ కళాశాలలు రెండో శనివారం కూడా పనిచేయాలని ఇంటర్మీడియట్‌బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్ధులకు దసరా సెలవులు ముగిసినా ఆర్టీసీ సమ్మెకారణంగా సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఇంటర్‌విద్యార్ధుల సిలబస్‌ను పూర్తిచేసేందుకు 2020, మార్చి వరకూ రెండో శనివారంకూడా కళాశాలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈవిషయాన్ని జూనియర్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ దృష్టిలో పెట్టుకుని ఉత్తర్వులను పాటించాలని ఆయన పేర్కొన్నారు.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *