Breaking News
Home / Film News / ‘జబర్దస్త్’ ఫేం పొట్టి నరేష్‌ బృందంపై రాళ్లతో దాడి

‘జబర్దస్త్’ ఫేం పొట్టి నరేష్‌ బృందంపై రాళ్లతో దాడి

పొట్టి నరేష్‌ బృందంపై రాళ్లతో దాడి
బౌన్సర్‌కు గాయాలు.. ఐదుగురి అరెస్ట్‌
శ్రీకాకుళం: కళిగాంధ్ర ఉత్సవాలు రెండో రోజు శనివారం రాత్రి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జరిగిన సంఘటనతో చివరి రోజు అయిన ఆదివారం పోలీసుల భద్రత పెంచారు. వివరాల్లోకి వెళితే… శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జబర్ధస్‌ ఫేం పొట్టి నరేష్‌, మరో మహిళా డ్యాన్సర్‌ పోటీల నిర్వహణకు సిద్ధమవుతున్న సమయంలో కొంతమంది అల్లరిమూకలు వేదిక వద్దకు చేరి వారిని ఇబ్బంది పెట్టారు. దీంతో బౌన్సర్లు అల్లరిమూకలను నియంత్రించేందకు యత్నించారు. దీంతో కొంతసేపు వివాదం నెలకొంది. గొడవను సద్దుమణిగించేందుకు సరిపడా పోలీసులు లేకపోవడంతో, చివరకు ఈ ఉత్సవాలకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శివశంకర్‌ కలుగుచేసుకుని వివాదాన్ని సద్దుమణించారు.

అయితే ఈ ఉత్సవ్‌ ఏర్పాట్లలో అలసత్వం వహించినందుకు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీరాముల నాయుడు, ఏఎస్పీ పనసారెడ్డికి షోకాజ్‌ నోటీసులు పీవో జారీ చేశారు. శనివారం వరకు జిల్లా ఇన్‌చార్జి జేసీగానూ ఉండడంతో ఈ హోదాలోనే షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం భారీ పోలీస్‌ బందోబస్త్‌ను నియమించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ వెంకటరత్నం చర్యలు తీసుకున్నారు.

దారికాచి మరీ….
జబర్ధస్త్‌ ఫేం పొట్టి నరేష్‌ బృందంపై, మరో మహిళా డ్యాన్సర్‌పై కక్షగట్టిన అల్లరిమూకలు దారికాచి మరీ దాడికి పాల్పడ్డారు. ఉత్సవాల్లో పాల్గొన్న వీరు కార్యక్రమాలను ముగించుకుని వెళ్తుండగా కిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో పొట్టి నరేష్‌ వాహనాలను అడ్డుకుని అల్లరిమూకలు రాళ్లువిసిరారు. ఈ ఘటనలో వెంకట పారినాయుడు అనే వ్యక్తి భుజంపై గాయమైంది. దీనిపై రెండోపట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ నిర్వహించారు. రాళ్లదాడికి పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చిన్నబజారు ప్రాంతానికి చెందిన సత్తి ప్రభాకరరెడ్డి, ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన మెత్తాన మణికంఠ, మర్ల చైతన్య, దోగాన పవన్‌, గుడివీధికి చెందిన వల్ల విజయ్‌ధర నాయుడులను రెండోపట్టణ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు.

Check Also

మేము పెళ్లి చేసుకోబోతున్నాం: ప్రకటించిన ప్రేమజంట

Share this on WhatsAppమార్చిలో పెళ్లి చేసుకోవోతున్నామంటూ మరో ప్రేమ జంట అధికారికంగా ప్రకటించేసింది. ఆర్య, సాయేషా ప్రేమ వ్యవహారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *