Breaking News
Home / National / జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు… భయాందోళనలో ప్రజలు…

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక ఆదేశాలు… భయాందోళనలో ప్రజలు…

రెండు నెలలకు సరిపడా ఎల్ఫీజీ నిల్వలను రెడీగా ఉంచుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయిల్ అండ్ గ్యాస్ డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను తక్షణమే పాటించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రజల్లో తెలియని భయం పట్టుకుంది. ఏం జరగబోతుందో తెలియడం లేదు. అంతేకాదు, గండేర్ జిల్లాలో 16 విద్యా సంస్థల భవనాలను తమ ఆధీనంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఆయా భవనాల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను దించబోతున్నది. భారీ స్థాయిలో బలగాలు రాబోతున్నాయి అని తెలియడంతో అక్కడి ప్రజల్లో తెలియని భయం నెలకొన్నది. ఎందుకు ఈ స్థాయిలో బలగాలు దించుతున్నారో అర్ధం కావడం లేదు. ఏమీ లేదు అంటూనే గతేడాది బలగాలను దించి ఆర్టికల్ 370 ని రద్దు చేశారు. ఇప్పుడు కూడా కేంద్రం ఏదో బలమైన కారణంతోనే బలగాలను దించబోతున్నది. బోర్డర్లో పాక్, చైనా దేశాల కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం ఏదో తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

Check Also

మళ్లీ లాక్ డౌన్

Share this on WhatsApp కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజధాని నగరమైన పట్నాలో ఈ నెల 10 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *