Breaking News
Home / National / లైంగిక దాడుల విచారణపై కీలక నిర్ణయం…

లైంగిక దాడుల విచారణపై కీలక నిర్ణయం…

లక్నో : లైంగిక దాడుల కేసులపై సత్వర విచారణను చేపట్టే క్రమంలో, 218 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. పోక్సో చట్టం కింద నమోదైన లైంగిక దాడి కేసులను కూడా ఈ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్లో విచారణ చేపడతారు. వీటికితోడు లైంగిక దాడి కేసులను మాత్రమే విచారించేందుకు మరో 144 కోర్టులు, పోస్కో కేసులను విచారించేందుకు 74 కోర్టులను ఏర్పాటు చేస్తారు. ఈ కోర్టుల నిర్మాణానికి ఒక్కో కోర్టుకు యూపీ ప్రభుత్వం రూ 75 లక్షలు వెచ్చిస్తుంది. యూపీ అంతటా దాదాపు 25479 లైంగిక దాడి కేసులు వివిధ కోర్టుల్లో పెండిగ్‌లో ఉన్నాయి. ఉన్నావ్‌ లైంగిక దాడి కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం లైంగిక దాడి కేసుల విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *