Breaking News
Home / National / ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాస్టిక్ తయారీ విగ్రహం

ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాస్టిక్ తయారీ విగ్రహం

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన గాంధీ చరఖా (రాట్నం)ను నొయిడాలో ఇవాళ ఆవిష్కరించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాస్టిక్ తయారీ విగ్రహంగా నిర్వాహకులు చెబుతున్నారు. శాటిలైట్ సిటీ సెక్టార్ 94లో ఈ రాట్నాన్ని గౌతమ్‌ బుద్ధ నగర్ ఎంపీ మహేష్ శర్మ, నొయిడా ఎమ్మెల్యే పంగజ్ సింగ్ ఆవిష్కరించనున్నారు. 1,650 కిలోల బరువుతో, 14 అడుగుల ఎత్తు, 20 అడుగుల విస్తీర్ణం, ఎనిమిది అడుగుల వెడల్పుతో ఈ రాట్నాన్ని తయారు చేశారు. ఇందుకోసం 1,250 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వాడారు. రాట్నం తయారీతో సరైన రీతిలో ప్లాస్టిక్ డిస్పోజల్‌పై ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేసినట్టు నొయిడా అథారిటీ సీఈఓ రీతూ శర్మ తెలిపారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ఉద్వాసన పలకాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును అనుగుణంగా నొయిడాలో ఈ ప్రయత్నం చేపట్టామని రీతూ శర్మ చెప్పారు. పౌరుల నుంచి స్వచ్ఛందంగా ప్లాస్టిక్ సేకరణను సెప్టెంబర్ 11న చేపట్టామని, అక్టోబర్ 27 వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాగా దీనిని గుర్తించేందుకు ‘గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ ‘ అధికారులను కూడా నొయిడా అథారిటీ సంప్రదించనుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *