Breaking News
Home / Sports / చివరి టీ20 నేడే.. భారత్‌-వెస్టిండీస్‌ జట్లు అమీతుమీ

చివరి టీ20 నేడే.. భారత్‌-వెస్టిండీస్‌ జట్లు అమీతుమీ

ముంబై: మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమమైన వేళ పైచేయి ఎవరిదో తేల్చుకునేందుకు భారత్‌-వెస్టిండీస్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సిరీస్‌ను నిర్ణయించే మూడోదైన చివరి మ్యాచ్‌ బుధవారం వాంఖడే మైదానంలో జరగనుంది. విరాట్‌ వీరోచిత ఆటతీరుతో తొలి మ్యాచ్‌ను దక్కించుకున్న భారత్‌.. రెండో మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమై ఓటమిపాలైంది. దీంతో సిరీస్‌ కోసం కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడి నెలకొంది. యువ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, కీపర్‌ రిషభ్‌ పంత్‌పై మరోసారి అందరి దృష్టీ నెలకొంది. అటు విండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌కు కూడా వాంఖడే ‘సొంత’ మైదానంలాంటిదే. ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా ఇక్కడి పరిస్థితులు, పిచ్‌పై అతడికి సంపూర్ణ అవగాహన ఉంది. దీనికి తోడు తమ బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు కూడా పూర్తి ఫామ్‌లో ఉండడంతో వెస్టిండీస్‌ జోష్‌లో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం ఖాయమనిపిస్తోంది. 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీ్‌సలో భారత్‌ను విండీస్‌ ఇక్కడే ఓడించి ఫైనల్‌కు చేరింది. అయుతే తమ చివరి 39 టీ20ల్లో 12 మ్యాచ్‌లే గెలిచిన విండీస్‌.. ఇప్పుడు ఏకంగా భారత్‌పై సిరీస్‌ గెలవాలన్న పట్టుదలతో ఉంది.

Check Also

భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై లయన్‌ వ్యాఖ్య

Share this on WhatsAppసిడ్నీ: విరాట్‌ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *