Breaking News
Home / Film News / ఎన్టీఆర్ విడుదల చేసిన తాజా చిత్ర ఫస్ట్‌లుక్‌….

ఎన్టీఆర్ విడుదల చేసిన తాజా చిత్ర ఫస్ట్‌లుక్‌….

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. రితేశ్‌ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చిరంజీవి(చెర్రీ), హేమలత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీ సింహా కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అయితే, తాజాగా ‘మత్తు వదలరా’ సినిమా ఫస్ట్‌లుక్‌ను సోషల్‌మీడియా వేదికగా టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ‘సమయం ఎలా గడుస్తుందో తెలియడం లేదు.. నా సోదరులు అందరూ పెరిగి పెద్దవాళ్లయ్యారు. ‘మత్తు వదలరా’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. శ్రీసింహా కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు కాళభైరవ (కీరవాణి కుమారుడు) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొరమం భీమ్‌గా కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *