సిద్ధిపేట: పట్టణంలోని మిలన్ గార్డెన్ రోడ్డులో బృందావన కాలనీ ఎదురుగా ఉన్న హరితహారం 30చెట్లను నరికిన తెలుజూరు బాలయ్య అనే వ్యక్తికి సిద్దిపేట మున్సిపల్ అధికారులు రూ.30వేల జరిమానా విధించారు. మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతనితో 30చెట్లు నాటించి, సంవత్సర కాలం వరకు ఆ మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించారు.
