సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని నాగుల బండ పరిధిలో నిర్మిస్తున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి హరీష్ రావు, ఎల్వి ప్రసాద్ సంస్థ చైర్మన్ డా.జి.ఎన్ రావుతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఈ ఆసుపత్రి రావడం ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, హైదరాబాద్ కు వెళ్లకుండా కంటి చికిత్సలు చేసుకొనే ఆవకాశం మన సిద్దిపేటలోనే రాబోతుందని తెలిపారు. నిర్మాణ పనులపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. డిసెంబర్ నెలలో ప్రారంభానికి సిద్ధం చేయాలని, ఆ దిశగా మిగులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు చెప్పారు. డిసెంబర్ 15 న ప్రారంభం చేసుకుందామని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి, చెట్లు నాటాలని సూచించారు.
