Breaking News
Home / States / రాజగోపాల్‌ రెడ్డి దంపతులకు తప్పిన ప్రాణాపాయం

రాజగోపాల్‌ రెడ్డి దంపతులకు తప్పిన ప్రాణాపాయం

వైరు తెగి ఓ భక్తురాలికి విద్యుదాఘాతం..
రక్షించే ప్రయత్నంలో ఎమ్మెల్యే దంపతులకూ షాక్‌
శాలిగౌరారం: నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి దంపతులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. విద్యుదాఘాతానికి గురైన ఓ మహిళను రక్షించే ప్రయత్నంలో ఎమ్మెల్యే దంపతులూ విద్యుదాఘాతానికి గురయ్యారు. శాలిగౌరారం మండలం చిత్తలూరులో శ్రీ శాంభవి శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి కల్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకలో రాజగోపాల్‌రెడ్డి, లక్ష్మి దంపతులు పాల్గొన్నారు. కల్యాణ వేదికపై రాజగోపాల్‌రెడ్డి, ఆయన భార్య లక్ష్మిని సన్మానిస్తున్న సందర్భంగా లైటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగ తెగి ఓ భక్తురాలికి తగిలింది. ఆమె షాక్‌తో గిలగిలా కొట్టుకుంటుండగా గమనించిన ఎమ్మెల్యే సతీమణి లక్ష్మి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు.

ఆమెకు కూడా షాక్‌ కొట్టడంతో కింద పడిపోయారు. భార్యను రక్షించే ప్రయత్నంలో రాజగోపాల్‌రెడ్డి కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. అందరూ బాగానే ఉన్నారని, ఎవరు ఆందోళనకు గురికావద్దని రాజగోపాల్‌రెడ్డి ఆలయానికి వచ్చిన భక్తులకు ధైర్యం చెప్పారు.

Check Also

విజయసాయి రెడ్డి బుద్దా వెంకన్న విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *