Breaking News
Home / Crime / సేల్స్ గర్ల్‌ను హత్య చేసి… షోరూంలో దొంగతనం…

సేల్స్ గర్ల్‌ను హత్య చేసి… షోరూంలో దొంగతనం…

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఓ మొబైల్ షోరూంలోకి చొరబడిన దొంగలు అక్కడ పనిచేసే సేల్స్ అమ్మాయిని హతమార్చి భారీ ఎత్తున డబ్బు, మొబైల్ ఫోన్స్ దోపిడీ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తరాఖండ్‌లోని సింగ్‌నగర్ జిల్లా కాశీపూర్ ప్రాంతంలో పింకీ రావత్, స్థానిక మనీష్ చావ్లా మొబైల్ షోరూంలో సేల్స్ అమ్మాయిగా పనిచేస్తోంది. అయితే ఎప్పటిలాగే ఉదయం షాప్ తెరిచి సేల్స్ ప్రారంభించిన పింకీ రావత్‌ తన పనిలో నిమగ్నమైంది. ఇంతలో ఇద్దరు అనుమానితులు షాపులోకి ప్రవేశించి పవర్ బ్యాంకు కొంటామని బేరం ఆడటం ప్రారంభించారు. అయితే కాసేపటికే నిందితులు పింకీ రావత్‌కు కత్తి చూపించి కౌంటర్ లోని డబ్బు అలాగే ఖరీదైన ఫోన్లను తమకు ఇచ్చేయాలని లేదంటే కత్తితో పొడుస్తామని బెదిరించారు.

దీంతో పింకీ రావత్ చుట్టుపక్కల వాళ్లను పిలిచి నిందితులను పట్టించాలని ప్రయత్నం చేసింది. అయితే ఇంతలో నిందితులు పింకీ పై కత్తితో దాడి చేశారు. దీంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది. రక్తపు మడుగులో ఉన్న పింకీని అలాగే వదిలేసి షాపులోని లక్షరూపాయల నగదుతోపాటు, 11 ఖరీదైన మొబైల్ ఫోన్లతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *