సూర్యాపేట: మూసీ ప్రాజెక్టు నుంచి నీటి లీకేజీ నేటికీ కొనసాగుతోంది. రెగ్యులేటరీ గేట్ నుంచి ఆరు రోజులుగా నీరు లీక్ అవుతోంది. దీంతో మూసీ నీటిమట్టం 645 నుంచి 619 అడుగులకు పడిపోవడంతో మూసీ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. నీటి లీకేజీని ఆపేందుకు స్టాప్ లా గేట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో స్టాప్ లా గేట్లు తయారవుతున్నాయి.
