Breaking News
Home / States / కారు నెంబర్ ప్లేట్‌పై జగన్ పేరు.. అవాక్కైన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు

కారు నెంబర్ ప్లేట్‌పై జగన్ పేరు.. అవాక్కైన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్: కారు నెంబర్ ప్లేట్‌పై నెంబర్‌కు బదులు ఏపీ సీఎం జగన్ అని రాసుకున్నాడు. తెలంగాణలో యథేచ్ఛగా తిరుగుతూ పోలీసు చలానాల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అతగాడి ఆలోచనకు ట్రాఫిక్ పోలీసులు బ్రేక్ వేశారు.

తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వచ్చిన కారును పోలీస్ సిబ్బంది ఆపారు. కారు నెంబర్ ప్లేట్‌కు బదులు ఏపీ సీఎం జగన్ అని ఉండటంతో ఇదేంటని ప్రశ్నించారు. చలాన్లు, టోల్ గేట్‌ల వద్ద ఫీజు మినహాయింపు కోసం ఇలా చేసినట్లు యువకుడు ముప్పిడి హరి తెలిపాడు. ఈ మేరకు కారును జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి లా అండ్ ఆర్డర్ పోలీస్‌లకు అప్పగించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *