Breaking News
Home / National / డబ్బు సంచితో ఉడాయించిన వానరం

డబ్బు సంచితో ఉడాయించిన వానరం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆకలితో ఉన్న ఓ వానరం ఓ వ్యక్తి చేతిలో ఉన్న డబ్బు సంచిని తీసుకొని ఉడాయించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న రూ.57 వేల నగదును బ్యాంకులో జమ చేయడానికి తీసుకెళుతున్నాడు. మధ్యలో మరో పనిలో నిమగ్నమై ఆ సంచిని పక్కన పెట్టాడు. దీనిని గమనించిన ఓ కోతి ఆ సంచిని తీసుకొని ఉడాయించింది. సమీపంలోని చెట్టు ఎక్కి తాపీగా ఆ సంచిలో తినుబండారాల కోసం వెతికింది. ఆశించినవి ఏవీ దానిలో లేకపోవడంతో నోట్లను విసిరేసింది. ఇదంతా చూసి బెంబేలెత్తిన ఆ వ్యక్తి కేకలు వేయడంతో గూమిగూడిన జనం నోట్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. చాలా మంది నోట్లను ఆ వ్యక్తికే తిరిగి అప్పగించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *