Breaking News
Home / National / ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం…

ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం…

ఒడిశా : అవినీతికి పాల్పడి దొరికిన నలుగురు ప్రభుత్వ అధికారుల విషయంలో ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ ఎక్సైజ్‌ కమిషనర్‌, ఒడిశా ప్రాంతీయ రవాణాశాఖ అధికారి సహా ఇద్దరు అటవీ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. వీరిపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ విభాగం ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీరందరికీ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొంది. దీంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఆ నలుగురిపై నిర్బంధ పదవీ విరమణ వేటు వేసింది. వారితో బలవంతంగా పదవీ విరమణ చేయించింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *