Breaking News
Home / States / Andhra Pradesh / పందులు దాడిలో మృతి చెందిన వృద్ధుడు

పందులు దాడిలో మృతి చెందిన వృద్ధుడు

పందులు దాడిచేసి ఓ వృద్ధుడిని చంపేసిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌ గ్రామంలో జరిగింది. కొండయ్య అనే వృద్ధుడు నడవటానికి కూడా చేతకాని పరిస్థితిలో ఓ ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఓ పంది అతనిపై దాడి చేసింది. తల, చేతిని పీక్కుతింది. దీంతో కొండయ్య అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ ఘటనతో గ్రామస్తులు పందులను చూసి భయాందోళనకు గురవుతున్నారు. గతంలోనే గ్రామంలో పందులు పెంచుతున్న వారికి పంచాయతీ తరపున నోటీస్‌లు కూడా ఇచ్చారు. గ్రామంలోని పందులను వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పారు. అయినా పరిస్థితిలో మార్పులేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *