కర్నూలు: తుంగభద్ర జలాశయనికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 20,470 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 19,990 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 1,633 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 100.855 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం నీటినిల్వ 100.855 టీఎంసీలు ఉంది. దీంతో అధికారులు తుంగభద్ర జలాశయం 5 గేట్లు ఎత్తి వేసి.. 7,685 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు.
