హైదరాబాద్: తెలంగాణలో మూడోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు, ఉద్యోగులు ఇంకా విధుల్లో చేరలేదు. మరోవైపు ఉద్యోగాల కోసం డిపోల వద్ద నిరుద్యోగులు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తనివ్వబోమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన నెలకొంది.
