Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రజల దృష్టి మరల్చేందుకే గందరగోళ వ్యాఖ్యలు చేస్తున్నారు: గోరంట్ల

ప్రజల దృష్టి మరల్చేందుకే గందరగోళ వ్యాఖ్యలు చేస్తున్నారు: గోరంట్ల

అమరావతి: బుద్ధి, జ్ఞానం లేకుండా వైసీపీ మంత్రుల వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రాజధాని భూములు తిరిగి ఇస్తామంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో జరుగుతున్న పనులను ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీయేనని… పులివెందుల గ్యాంగ్‌లు అన్ని ప్రాంతాలకూ విస్తరించాయన్నారు. అరాచకపాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే గందరగోళ వ్యాఖ్యలు చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *