Breaking News
Home / States / అసలు రిలేషన్‌షిప్ ఇప్పుడు మొదలైంది…

అసలు రిలేషన్‌షిప్ ఇప్పుడు మొదలైంది…

హైదరాబాద్‌: ఇటీవల బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌: సీజన్‌3’. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ఆద్యంతం ఆకట్టుకుంది. మొత్తం 17మంది సభ్యులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ సీజన్‌-3 విజేతగా నిలిచాడు. చివరి వరకూ యాంకర్‌ శ్రీముఖి అతడికి గట్టిపోటీ ఇచ్చింది. అయితే, హౌస్‌లో ఉండగా వీరిద్దరి మధ్య వివాదం రేగిన సంగతి తెలిసిందే.

ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. ‘ఈ హౌస్‌లోకి వచ్చినప్పుడు శ్రీముఖి మాత్రమే నాకు తెలుసు. తను నా ఫ్రెండ్‌గా ఉంటుందనుకున్నా. కానీ, పరిస్థితులు మారిపోయాయి’ అంటూ రాహుల్‌ చెప్పగా, ‘రాహుల్‌ వ్యవహారశైలి కారణంగానే తాను మారాల్సి వచ్చింది’ అని శ్రీముఖి చెప్పుకొచ్చింది. వీరి మధ్య జరిగిన వాదోపవాదాలను ప్రేక్షకులకు ఆసక్తిగా తిలకించారు.

కాగా, ఇప్పుడు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇరువురు తమ ఇన్‌స్టాలో ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ, ”గతం గతః.. అసలు రిలేషన్‌షిప్‌ ఇప్పుడు మొదలైంది” అంటూ అభిమానులతో పంచుకున్నారు. పాత గొడవలు మర్చిపోయి మళ్లీ స్నేహితులుగా మారినందుకు వారి అభిమానులు సంతోషిస్తున్నారు. ‘బిగ్‌బాస్‌: సీజన్‌3’ తర్వాత ఇద్దరూ ఎవరి షోలలో వారు బిజీ అయిపోయారు. రాహుల్‌ ఏకంగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తండ’ లో నటుడిగా అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ గాయకుడిగా తన సత్తా ఏంటో చాటిన రాహుల్‌ నటుడిగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *