Breaking News
Home / National / పార్టీ నన్ను గుర్తించట్లేదు …

పార్టీ నన్ను గుర్తించట్లేదు …

హైదరాబాద్ : బీజేఎల్పీ నేతగా తనను పార్టీయే గుర్తించడం లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక లక్ష్మణ్ ఓటమికి అధ్యక్ష పదవే కారణమని పేర్కొన్నారు. పార్టీ పనుల్లో బిజీగా ఉండడంవల్లే నియోజకవర్గంపై లక్ష్మణ్ దృష్టి పెట్టలేదని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ తనకు రాజకీయ మార్గదర్శి అని రాజాసింగ్ వెల్లడించారు. అధ్యక్ష పదవిపై తనకు ఆశ లేదని పేర్కొన్నారు. హిందూ ధర్మం, గో రక్షణే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు.ఇక పార్టీలో పెద్ద నాయకులు తన ఓటమికి పని చేస్తే… కార్యకర్తలు మాత్రం ప్రాణం పోసి తనను గెలిపించారని రాజాసింగ్ వెల్లడించారు. రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *