సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జ్‌లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ, బీజేపీలకు ప్రజల నుంచి స్పందన ఉండదన్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు మరో ఘోర పరాజయం తప్పదని కేటీఆర్ అన్నారు. హుజూర్నగర్ అభివృద్ధిపై ఉత్తమ్‌వి అబద్ధాలని కేటీఆర్ విమర్శించారు. గతంలో కలిసి పోటీ చేసి, నేడు విడిగా కలబడుతున్న విపక్షాల అనైక్యతను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
