Breaking News
Home / Education / ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగాలి…

ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగాలి…

హైదరాబాద్‌: ఈ ఏడాది ఒక్క ఇంటర్ విద్యార్థి కూడా ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాలని, ప్రైవేట్ జూనియర్ కాలేజీల అధ్యాపకులను, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ కోరారు. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరగాలని కోరుకుందామన్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో నియమించిన కౌన్సిలర్లకు రెండో విడత శిక్షణ శిబిరం నిర్వహించారు. విద్యార్థులను అర్థం చేసుకొని.. వారిని తీర్చిదిద్దడంలో కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించాలని జలీల్ కోరారు. త్వరలో ఆడియో, వీడియో తరగతులను ఇంటర్ వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *