విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో డ్రగ్స్ విక్రయ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నైజీరియన్లతో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద హెరాయిన్, 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్లు కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. బెంగుళూరు, ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
