అనంతపురం: అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురంలో టీడీపీ నేత నాగరాజు ఇంటికి అడ్డంగా బండరాళ్లను పెట్టారు. బండరాళ్లను తొలగించేందుకు వెళ్తున్న జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురికి వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేేసి బుక్కరాయ సముద్రం పీఎస్ కు తరలించారు.
