Breaking News
Home / States / Andhra Pradesh / తాజా జీవోతో టీటీడీలో ప్రకంపనలు….

తాజా జీవోతో టీటీడీలో ప్రకంపనలు….

తిరుమల: రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవో నంబర్ 2323 తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపాదికన నియమించిన ఉద్యోగులను తొలగించాలని తాజా జీవోలో ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అప్రమత్తమై అలాంటి ఉద్యోగులందరినీ గుర్తించి నివేదిక సమర్పించాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ రోజు రాత్రి లోపు 60 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీటీడీ రిటైర్డ్ సూపరిడెంట్ డాలర్ శేషాద్రిపై కూడా పూర్తి స్థాయిలో వేటు పడనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీటీడీ ఇటీవల 12 మంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి చేసిన నియామకం కూడా ఈ జీవోతో ఆగిపోనుంది.

రిటైర్ అయి 10 ఏళ్లు అయినా….
డాలర్ శేషాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం సూపరిడెంట్‌గా పదవీ విరమణ చేసి పదేళ్లు అయినా స్వామివారి సేవలోనే ఆయన కొనసాగుతున్నారు. మధ్యలో కొద్ది కాలం విరామం తీసుకున్నా మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. టీటీడీ అంటే డాలర్ శేషాద్రి ఒక్కరే అనేలా ఆయన పేరు సంపాదించుకున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోతో డాలర్ శేషాద్రిపై కూడా వేటు పడనుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *