Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / శిక్షలు కఠినంగా లేకపోవడం వల్లే …

శిక్షలు కఠినంగా లేకపోవడం వల్లే …

అమరావతి :ఎన్‌కౌంటర్‌ ద్వారా దిశకు న్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. తెలంగాణా ప్రజల అభీష్టం మేరకు ఎన్‌కౌంటర్‌ జరిగిందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శిక్షలు కఠినంగా లేకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తెలిపారు. ఎపిఐఐసి ఛైర్‌పర్సన్‌ ఆర్‌.కె.రోజా మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. మహిళల పట్ల అన్యాయంగా వ్యవహరించేవారికి ఇది సరైన సమాధానమని పేర్కొన్నారు. దేశమంతా ఈ తరహా తీర్పు కోసం ఎదురు చూసిందని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా జరిగిందని పేర్కొన్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. దిశకు సరైన న్యాయం జరిగిందని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *