Breaking News
Home / National / ఓటర్లను అడ్డుకుంటున్న వరుణుడు..

ఓటర్లను అడ్డుకుంటున్న వరుణుడు..

న్యూఢిల్లీ: ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కురవడంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు ఓటర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల వర్షంలో తడుస్తూనే ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, సతారా, కొల్హాపూర్, సింధూదుర్గ్, సంగ్లి, నాసిక్‌, పూణె, రత్నగిరి, సోలాపూర్, బీద్, ఓస్మానాబాద్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయయని భారత వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. వర్షం కురుస్తుండటంతో ఓటింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉందని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఓటింగ్‌పై ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *