Breaking News
Home / National / బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఇవే: అమిత్ షా

బీజేపీ ఓడిపోవడానికి కారణాలు ఇవే: అమిత్ షా

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి తమ నేతలు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమైయుండొచ్చని ఆ పార్టీ మాజీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన ఇవాళ తొలిసారి స్పందించారు. ”వాళ్లు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు…” అని ఆయన విచారం వ్యక్తం చేశారు. టైమ్స్ నౌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన… ”గోలీ మారో” నినాదంతో పాటు, ఢిల్లీ ఎన్నికలను భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌తో పోల్చడం వంటి విద్వేష ప్రకటనలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ దూరం జరిగిందనీ.. వాటిని పార్టీ అభిప్రాయాలుగా భావించరాదని ఆయన అన్నారు.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *