రాయచూరు: నగరంలోని గోశాల నుంచి సియాతలాబ్కు వెళ్లే రోడ్డుపై అకస్మాత్తుగా పెద్ద గుంత ఏర్పడింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ట్రాక్టర్ ఆ గుంతలో ఇరుక్కుపోగా స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ట్రాక్టర్ ఇంజన్ భాగం పూర్తిగా ఇరుక్కుపోవడంతో ప్రజలు భూకంపం వచ్చిందంటూ భయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్పీ తన సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రేన్ సాయంతో ట్రాక్టర్ ఇంజన్ను తొలగించారు.
