Breaking News
Home / National / దేశ ఆర్థిక వ్యవస్థలో నేవీ పాత్ర కూడా కీలకం…

దేశ ఆర్థిక వ్యవస్థలో నేవీ పాత్ర కూడా కీలకం…

ఢిల్లీ: దేశ పశ్చిమ తీరంలో పయనిస్తున్న నౌకాదళ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బస చేసిన సందర్భంగా షిప్‌ డెక్‌ నుంచి కాలిబర్‌ మీడియం మెషీన్‌ గన్‌ నుంచి ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. రెండు చేతుల్లో గన్‌ పట్టుకుని సముద్రంలోకి కొన్ని రౌండ్ల పాటు కాల్పులు జరిపిన అనంతరం కేంద్ర మంత్రి సెయిలర్లతో మాట్లాడారు. ఫైరింగ్‌ను బాగా ఆస్వాదించినట్లు తెలిపారు. వాహక నౌక వద్ద పనిచేస్తున్న అధికారులు కుటుంబాలకు లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. సాగరంలో జలాంతర్గాములు, ఇతర యుద్ధనౌకలు చేసిన అనేక విన్యాసాలను వీక్షించి దేశ ఆర్థిక వ్యవస్థలో నేవీ విభాగం కూడా కీలక పాత్ర వహిస్తోందన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *