Breaking News
Home / National / బీఎస్ఎన్ఎల్ నుంచి మళ్లీ వచ్చేసిన రూ.96 ప్రీపెయిడ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ నుంచి మళ్లీ వచ్చేసిన రూ.96 ప్రీపెయిడ్ ప్లాన్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.96 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూలైలో ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల కోసం దీనిని తీసుకొచ్చింది. ఈ నెలతో గడువు ముగియనుండడంతో తిరిగి దీనిని మరోమారు తీసుకొచ్చింది. ఈసారి 90 రోజుల పాటు ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది. అప్పట్లో ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభించేవి. కాలపరిమితి 21 రోజులు. ప్రస్తుతం అవే ప్రయోజనాలు ఉన్నప్పటికీ కాలింగ్ పరిమితిని రోజుకు 250 నిమిషాలకు పరిమితం చేసింది.

21 రోజుల కాలపరిమితి ముగిసిన తర్వాత బేస్ ప్లాన్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్యాక్‌ను ప్రవేశపెట్టడంతోపాటు రూ.118 ఎస్టీవీ, రూ.153 పీవీ ప్యాక్‌లను సవరించింది. రూ.118 ఎస్టీవీలో రోజుకు 0.5 జీబీ డేటా, రోజుకు 250 నిమిషాల కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. కాలపరిమితి 28 రోజులు. రూ.153 పీవీ ప్యాక్‌లో ఇవే ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌కు పర్సనలైజ్‌డ్ రింగ్ బ్యాక్ టోన్ (పీఆర్‌బీటీ) సౌకర్యాన్ని జతచేసుకోవచ్చు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *