Breaking News
Home / States / ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె…

ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె…

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంతకంతకూ తీవ్రతరమవుతోంది. వివిధ శాఖలకు సంబంధించిన పలు సంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలుకుతున్నాయి. తాజాగా, తెలంగాణ ట్రేడ్ యూనియన్ లో ఉన్న 21 విద్యుత్ సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. వారితో పాటు తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీని నిర్వహించారు. మరోవైపు, ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు మధ్య అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తానని టీఆర్ఎస్ ఎంపీ కేకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *